గడ్డివాముల దగ్ధం

ABN , First Publish Date - 2022-03-23T05:35:18+05:30 IST

మండలంలోని పులకుర్తి మజరా గ్రామం మెరుగుదొడ్డిలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి.

గడ్డివాముల దగ్ధం

 కోడుమూరు(రూరల్‌), మార్చి 22: మండలంలోని పులకుర్తి మజరా గ్రామం మెరుగుదొడ్డిలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన జయన్న అనే రైతు కల్లందొడ్డిలో వరి, కంది, జొన్నచొప్ప, వేరుశనగ గ్రాసాలను కలిపి గడ్డివాములు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే గడ్డివాముల నుంచి పొగలు వస్తున్న దృశ్యాన్ని చూసి పలువురు రైతులకు తెలిపారు. పక్కనే ఉన్న పశువుల పాకలో కట్టి ఉంచిన రెండు ఎద్దులను, సామగ్రిని తరలించారు. కోడుమూరు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

Read more