వైభవంగా బుగ్గ రామేశ్వరుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-05-30T06:19:26+05:30 IST

మండలంలోని కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం మాస శివరాత్రి సందర్భంగా బుగ్గ రామేశ్వరుడి కల్యా ణం వైభవంగా జరిగింది.

వైభవంగా బుగ్గ రామేశ్వరుడి కల్యాణం

ఓర్వకల్లు, మే 29: మండలంలోని కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం మాస శివరాత్రి సందర్భంగా బుగ్గ రామేశ్వరుడి కల్యా ణం వైభవంగా జరిగింది. అంతకుముందు స్వామి అమ్మవార్లను పల్లకిలో ప్రతిష్టించి ఆలయం చుట్టూ ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు డా.విశ్వనాథరెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చకులు కల్లె లక్ష్మీనారాయణశర్మ, లక్ష్మి నరసింహశర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ గుర్రాల చెన్నారెడ్డి, ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


Read more