మార్చి 8 నుంచి అహోబిలంలో బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-02-16T05:42:02+05:30 IST

అహోబిలం క్షేత్రంలో మార్చి 8 నుంచి బ్రహోత్సవాలు ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో నర్సయ్య తెలిపారు.

మార్చి 8 నుంచి అహోబిలంలో బ్రహ్మోత్సవాలు
మాట్లాడుతున్న ఈవో నర్సయ్య

రుద్రవరం, ఫిబ్రవరి 15: అహోబిలం క్షేత్రంలో మార్చి 8 నుంచి బ్రహోత్సవాలు ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో నర్సయ్య తెలిపారు. మంగళవారం మండలంలోని చందలూరు గ్రామంలో ఆయన మాట్లాడారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఉత్సవమూర్తుల సన్నిధానంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశామని అన్నారు. ఎగువలో 8న అంకురార్పణ, 9న ధ్వజారోహణ, 10న హంస వాహనం, 11న ఉత్సవం, 12, శేషవాహనం, 13న ఉత్సవం, 14న ఉత్సవం, 15న తిరుమంజనం, 16న ఉత్సవం, తొట్టి తిరుమంజనం, అశ్వవాహనం, 17న రథోత్సవం, అభిషేకం, 19న ఉత్సవం, ఆరాదన పుష్పయాగం, గరుడోత్సవం. దిగువ అహోబిలంలో 8న సెల్వారు కుత్తు ఉత్సవం, 9న అంకురార్పణ, 10న ధ్వజారోహణ, 11న హంస వాహనం, సూర్యప్రభ వాహనం, 12న యోగా నృసింహా ఆరాదన, 13న శేషవాహనం, చంద్రప్రభ వాహనం, 14న మోహిణి అలంకారం, శరభవాహనం, 15న వేణుగోపాలస్వామి అలంకారం, 16న అభిషేకం, గజవాహనం, తిరుకల్యాణోత్సవం, 17న కాళింగవర్దనోత్సవం, తొట్టి తిరుమంజనం, 18న రథోత్సవం, 19న తీర్థ చక్రస్నానం, గరుడోత్సవం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈవో తెలిపారు.  Read more