నన్నూరు జాతీయ రహదారి దిగ్బంధం

ABN , First Publish Date - 2022-02-19T05:36:02+05:30 IST

మండలంలోని నన్నూరు బస్‌ స్టేజీ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ రహదారిని దిగ్బంఽధించారు.

నన్నూరు జాతీయ రహదారి దిగ్బంధం

  1. సీపీఎం నాయకుల అరెస్టు


ఓర్వకల్లు, ఫిబ్రవరి 18: మండలంలోని నన్నూరు బస్‌ స్టేజీ వద్ద ఫ్లైఓవర్‌  నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ రహదారిని దిగ్బంఽధించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యుడు జి.రామక్రిష్ణ, సీపీఎం నాయకులు నాగన్న, షాజహాన్‌, శ్రీధర్‌, మధుసూదన్‌, మల్లేష్‌, రమణ, మాసూంబాషా, ఆంజనేయులు, ఎర్రమల, దస్తగిరి, మహేష్‌, సలాంలను పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా రామక్రిష్ణ మాట్లాడుతూ హైవేపై ప్రజలు, విద్యార్థులు రోడ్డు దాటుతుంటారన్నారు. ఇప్పటికీ రోడ్డు దాటుతూ 15 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫ్లైఓవర్‌ను నిర్మించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు ముర్తుజావలి, సుధాకర్‌, సలాంబాషా పాల్గొన్నారు.Read more