ఘనంగా బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి

ABN , First Publish Date - 2022-04-06T05:28:18+05:30 IST

గ్రీన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల శాఖ గ్రంథాలయంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఘనంగా బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి
నందికొట్కూరులో నివాళి అర్పిస్తున్న టీడీపీ నాయకులు

నంద్యాల (కల్చరల్‌), ఏప్రిల్‌ 5: గ్రీన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల శాఖ గ్రంథాలయంలో  జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజకీయవేత్త-జగ్జీవన్‌ రామ్‌ అనే అంశంపై  చర్చాగోష్టి నిర్వహించారు. జిల్లా గ్రంథా లయ సంస్ధ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వజ్రాల గోవిందరెడ్డి, మహానంది మండల ఉపవిద్యాశాఖా ధికారి రామసుబ్బయ్య, అన్నెం శ్రీనివాసరెడ్డి, దండు వెంకటేశ్వర్లు, శేషఫణి, మహబుబ్‌బాషా, అధ్యాప కులు, గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు.


నంద్యాల టౌన్‌: నంద్యాల పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చింతలయ్య, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వాసు, పలువురు నాయకులు పాల్గొన్నారు. 


 నంద్యాల పట్టణ సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు.  జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎండీ రఫీ పాల్గొన్నారు.ఆళ్లగడ్డ: పట్టణలోని మాదిగ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. గౌరవాధ్యక్షుడు బ్రహ్మం, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


చాగలమర్రి: చాగలమర్రి ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాలమహానాడు జిల్లా కార్యదర్శి ప్రసాదు ఆధ్వ ర్యంలో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు అంజయ్య, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


 చాగలమర్రిలో బీసీ సంక్షేమ సంఘం కర్నూలు, నంద్యాల జిల్లాల ఇన్‌చార్జి నాగరాజు, హమాలీల అధ్యక్షుడు గుత్తి నరసింహులు, మండల బీసీ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ మాజీ అధ్యక్షుడు ఓబులేసు, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు వీరమహేంద్రాచారి, ఎస్టీయూ నాయకుడు పెద్ద వెంకటయ్య, టీడీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, రమేష్‌, ధనుంజయుడు, బషీర్‌, టైలర్‌ చోటు, బాషా పాల్గొన్నారు.


నందికొట్కూరు: పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో నాయకులు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కౌన్సిలర్‌ భాస్కర్‌రెడ్డి, జాకీర్‌హుస్సేన్‌ పాల్గొన్నారు. పట్టణం లోని మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు జయసూర్య, ముర్తుజావలి, మద్దిలేటి, సత్తార్‌మియా, వెంకటే ష్‌ , వహీద్‌, ఆచారి, గిరి, బాబు పాల్గొన్నారు. 


ఆత్మకూరు: జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ మారూఫ్‌ ఆసియా, కమిషనర్‌ శ్రీనివాసరావు, కోఆప్షన్‌ సభ్యులు ఎంఏ రషీద్‌, కౌన్సిలర్లు ఉన్నారు. 


 ఆత్మకూరు పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను  నిర్వహించారు. నాయకులు స్వాములు, రణధీర్‌, రామ్‌నాయక్‌, వలి, మహెబూబ్‌బాషా, వీరన్న, పాలశివుడు తదితరులు ఉన్నారు. 


బనగానపల్లె: బనగానపల్లె కొత్తబస్టాండ్‌ సమీపం లోని ఎస్సీ కాంప్లెక్స్‌ ఆవరణలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.   నాయకులు నాగేశ్వరరావు, మూలింటి పెద్దమునెయ్య, రెడ్డిపల్లె ఓబన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


డోన్‌ (రూరల్‌): పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి, ప్యాపిలి మండల నాయకులు సుబ్బుయాదవ్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు భూమా నాగన్న, పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు నిర్వహిం చారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  కిష్టన్న, నాయకులు పాల్గొన్నారు. పెన్షనర్ల సంఘం కార్యాల యంలో జరిగిన జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకల్లో ఆ సంఘం నాయకులు కేఎన్‌ భానుసింగ్‌, గాలయ్య, గోపాల్‌, దాసప్ప, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పాతపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో యుటీఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు. 
Read more