దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-30T05:52:37+05:30 IST

జిల్లాలో పెండింగ్‌ ఉన్న ఫారం 6, 7, 8 పెండింగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు.

దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా

కర్నూలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 29: జిల్లాలో పెండింగ్‌ ఉన్న ఫారం 6, 7, 8 పెండింగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. గురువారం విజయవాడ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు జాబితా, ఎలక్షన్‌ పిటిషన్స్‌, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఓటరు కార్డుకు ఆధార అనుసంధాన ప్రక్రియను 31వ తేదీ మార్చి లోపు పూర్తి చేయాలన్నారు. పోలింగ్‌ స్టేషన్లు గుర్తించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అన్ని జిల్లా కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్‌  కోటేశ్వరరావు మాట్లాడుతూ ఫారం 6, 7, 8 పెండింగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కారిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, డీఆర్వో నాగేశ్వరరావు, ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి, పత్తికొండ ఆర్డీవో మోహన్‌దాస్‌, కర్నూలు ఆర్డీవో హరిప్ర సాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more