AP News: కర్నూలు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన రజకులు

ABN , First Publish Date - 2022-10-01T18:05:22+05:30 IST

మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై రజక వృత్తిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: కర్నూలు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన రజకులు

కర్నూలు (Kurnool): మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై రజక వృత్తిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడుతోందన్న కారణంతో అధికారులు దాదాపు 20 గాడిదలను ఓ వాహనంలో ఎక్కించి వదిలిపెట్టారు. దీంతో రెండు గాడిదలు ఆహారం లేక చనిపోయాయి. మరో రెండు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. దీంతో ఆగ్రహించిన రజక వృత్తిదారులు గాడిదలతో కర్నూలు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి గాడిదలను తోలి నిరసన తెలిపారు. గాడిదల మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రజక వృత్తిదారులు నినాదాలు చేశారు. రజకులకు దోబి ఘాట్లను నిర్మించాలని డిమాండ్ చేశారు.

Read more