13 నుంచి అమృతోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-11T04:50:41+05:30 IST

భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో 13 నుంచి 15 వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు.

13 నుంచి అమృతోత్సవాలు

 మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు 

కర్నూలు (కల్చరల్‌), ఆగస్టు 10: భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో  13 నుంచి 15 వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. బుధవారం కళాక్షేత్రంలో కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 13న సాయంత్రం ఆరు గంటలకు ఏపీ రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన హరిత రాజగోపాల్‌ కార్యక్రమాలను ప్రారంభిస్తారని, రవీంద్ర విద్యాసంస్థల ఛైర్మన జి. పుల్లయ్య గౌరవ అతిథిగా హాజరవుతారని తెలిపారు. అనంతరం పల్లేటి కులశేఖర్‌ రాసిన  శ్రీకృష్ణ కమలపాలిక నాటక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 14న సాయంత్రం 5.30 గంటలకు జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి   పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం ఉంటుందని అన్నారు.  కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరవుతారని తెలిపారు.  

 పత్తి ఓబులయ్యకు సన్మానం

జాతీయ అవార్డు అందుకున్న టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు, నంది అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్యను బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ నర్సయ్య, కోశాధికారి వి. వెంకటేశ్వర్లు, సభ్యులు తిరుపతి సాయి, బి. ఎల్లాగౌడ్‌, కె. రామకృష్ణ, క్రిష్టఫర్‌ పాల్గొన్నారు. 


Read more