-
-
Home » Andhra Pradesh » Kurnool » All facilities for devotees-MRGS-AndhraPradesh
-
అతిసార నివారణకు చర్యలు
ABN , First Publish Date - 2022-04-25T05:04:49+05:30 IST
మండలంలోని నల్లగట్ల గ్రామంలో అతిసార ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో అంకిరెడ్డి తెలిపారు.

ఆళ్లగడ్డ, ఏప్రిల్ 24: మండలంలోని నల్లగట్ల గ్రామంలో అతిసార ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో అంకిరెడ్డి తెలిపారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన నల్లగట్లలో అతిసార వ్యాధి అనే వార్తకు స్పందించి ఆదివారం ఆయన గ్రామంలో పర్యటించారు. గ్రామంలో మురికి నీటి కాలువలను శుభ్రం చేయాలని, మంచి నీటి ట్యాంకుల నుంచి సరఫరా అయ్యే నీటిని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించాలని అధికారులను ఆదేశించారు. అతిసార అదుపులోకి వచ్చే వరకు గ్రామంలో వైద్య శిబిరం నడపాలని వైద్యుడు రంగస్వామిని ఆదేశించారు. కాగా వ్యాధి అదుపులో ఉన్నదని, మరో రెండు రోజులు వైద్యశిబిరాన్ని నడుపుతామని వైద్యుడు రంగస్వామి తెలిపారు. ఈయనతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శంకర్, డీఈ రవికుమార్, ఏఈ నాయక్, హెల్త్ సూపర్‌వైజర్లు నాగార్జునరెడ్డి, దస్తగిరిరెడ్డి ఉన్నారు.