‘ఆదోనిని జిల్లా చేయాల్సిందే’

ABN , First Publish Date - 2022-02-23T05:39:04+05:30 IST

ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాల్సిందేనని యువత పట్టు వదలకుండా భీమాస్‌ కూడలిలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపింది.

‘ఆదోనిని జిల్లా చేయాల్సిందే’

ఆదోని, ఫిబ్రవరి 22: ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాల్సిందేనని యువత పట్టు వదలకుండా భీమాస్‌ కూడలిలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపింది.  జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కోటి, నాగరాజుగౌడ్‌, సాయిరాం, తిరుమలేష్‌ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కోసం రిలే నిరాహార దీక్ష మంగళవారానికి 16వ రోజుకు చేరుకుంది. కాపు, బలిజ సంక్షేమ సంఘ నాయకులు కడిమెట్ల రామకృష్ణ, న్యాయవాది లోకేష్‌, ప్రతాప్‌స్వామి, చందు, రాజశేఖర్‌, బీజేపీ నాయకుడు మలేకర్‌ శ్రీనివాస్‌ మద్దతు తెలిపారు. అనంతరం భీమాస్‌ కూడలిలో విద్యార్థులతో మానవహారం నిర్వహించి మోకాళ్లపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కోటి, నాగరాజ్‌గౌడ్‌, సాయిరాం మాట్లాడుతూ ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాల్సిందే అన్నారు. కార్యక్రమంలో నాయకులు వాల్మీకి సాయిప్రసాద్‌, తేజా, గిరి, మనోజ్‌, జాన్‌, సునీల్‌, రంగయ్య, తాయన్న పాల్గొన్నారు

Read more