-
-
Home » Andhra Pradesh » Kurnool » Adoni cm jagan students kurnool andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Adoni: విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్
ABN , First Publish Date - 2022-07-05T17:11:22+05:30 IST
జిల్లాలోని ఆదోనిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది.

కర్నూలు: జిల్లాలోని ఆదోనిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా విద్యాకానుక కిట్లు, పుస్తకాలను సీఎం పరిశీలించారు. అనంతరం క్లాసురూమ్‌లో విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రంలో 47.40 లక్షల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాకానుకను పంపిణీ చేయనుంది. ఇందుకోసం ఈ ఏడాది రూ.931 కోట్లను ఖర్చు చేయనుంది. అలాగే విద్యాకానుక కోసం మూడేళ్లలో రూ.2,368 కోట్ల ఖర్చును సర్కార్ భరించనుంది.
ట్రాఫిక్ ఆంక్షలు...
మరోవైపు సీఎం జగన్ పర్యటన దృష్ట్యా ఆదోనిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు, దుకాణాలను మూసివేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి హైస్కూల్ వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిపై బారికేడ్లు పెట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.