ఆనలైన హాజరు 28 శాతమే

ABN , First Publish Date - 2022-08-17T05:33:28+05:30 IST

ఆనలైనలో వ్యక్తిగత సెల్‌ ఫోన ద్వారా ఉపాధ్యాయుల హాజరు నమోదు విధానం మంగళవారం తొలి రోజు దాదాపుగా విఫలమైంది.

ఆనలైన హాజరు 28 శాతమే
ఎమ్మిగనూరులో యాప్‌ డౌనలోడ్‌కోసం కుస్తిపడుతున్న ఉపాధ్యాయులు

  1. యాప్‌ డౌనలోడ్‌ కాక ఇబ్బందిపడిన ఉపాధ్యాయులు
  2. చివరికి పాత పద్ధతిలోనే  సంతకాలు
  3. ఆనలైన అటెండెన్సీని బహిష్కరిస్తూ టీచర్ల సంఘాల పిలుపు  

 

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 16: ఆనలైనలో  వ్యక్తిగత సెల్‌ ఫోన ద్వారా ఉపాధ్యాయుల హాజరు నమోదు విధానం మంగళవారం తొలి రోజు దాదాపుగా విఫలమైంది. కేవలం జిల్లాలో 28 శాతమే హాజరు నమోదైంది. ఈ కొత్త విధానంపట్ల ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు.  ఆనలైనలో  ఉపాధ్యాయుల హాజరు నమోదుపై ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. మొబైల్‌ యాప్‌లో సెల్ఫీ అప్‌లోడు చేస్తేనే హాజరు నమోదవుతుంది. యాప్‌లో మొఖం, కళ్లు, తదితర ఫొటోలు అప్‌లోడు చేసుకునేందుకు ఉపాధ్యాయులు పడరాన్ని కష్టాలు పడ్డారు. సిగ్నల్‌ అందక, యాప్‌ అప్‌ లోడు కాక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేషియల్‌ రికగ్నేషన హాజరు నమోదుకు ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ తీసుకువచ్చింది. ఉపాధ్యాయుల సెల్‌పోనలోనే యాప్‌ను అప్‌ లోడు చేసుకుని తమ ఫొటోలను అప్‌లోడు చేయాలి. ప్రతిరోజు పాఠశాల వద్ద యాప్‌ ఓపన చేసి హాజరు నమోదు చేయాలి. ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తారు. ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు, సాయంత్రం పని గంటలు ముగిసిన తర్వాత తిరిగి వెళ్లేటప్పుడు హాజరు నమోదు చేయాలి. విలీనమైన పాఠశాలల  ఉపాధ్యాయులను కొత్త పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. యాప్‌లో మాత్రం పాత పాఠశాలల్లో పని చేస్తున్నట్లుగా చూపిస్తోంది.  స్మార్ట్‌ఫోన లేని ఉపాధ్యాయులు ఏమి చేయాలి?  వయస్సు మళ్లిన ఉపాధ్యాయులు బటన ప్రెస్‌   ఫోన్లనే వాడుతున్నారు. ఆనలైన హాజరుకు ఎలాంటి ఉపకరణాలు, నెట్‌ కనెక్షన్లు ఏర్పాటు చేయకుండా  హాజరు వేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో 7,697 మంది  ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 3,273 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 832 మంది, ఉన్నత పాఠశాలల్లో 3842 మంది పని చేస్తున్నారు. అయితే తొలిరోజు మంగళవారం కర్నూలు జిల్లాలో 2,175 మంది ఉపాధ్యాయులు రిజిస్టర్‌ చేసుకున్నారు. మరో 588 మంది ఆనలైనలో హాజరు నమోదు చేసుకున్నారు. జిల్లాలో 28 శాతం మాత్రమే హాజరు నమోదు అయింది. 

  ఎమ్మిగనూరు, ఆగస్టు 16:    ఎమ్మిగనూరు  జడ్పీ ఉన్నతపాఠశాలలో ఉపాధ్యాయులు సమయానికి ఆనలైన పద్ధతిలో హాజరు నమోదు చేసుకోలేకపోయారు.  10గంల తరువాత హాజరు నమోదు కాగా, సాయంత్రం 4గంటల తర్వాత మళ్లీ నమోదు అయినట్లు హెచఎం తెలిపారు. ఇదే పరిస్థితి మిగతా పాఠశాలల్లో కనిపించింది.  కోసిగి, పెద్దకడుబూరు మండలాల్లోని చాలా పాఠశాలల్లో యాప్‌ డౌనలోడ్‌ కాలేదు.  చేసుకున్నా అనేక చోట్ల హాజరు నమోదు కాలేదు. దీంతో ఉపాధ్యాయులు ఎప్పటిలాగేనే రిజిస్టర్‌లో సంతకాలు చేశారు.   మంత్రాలయం మండలంలోని మాధవరం ప్రాథమిక పాఠశాల (ప్రత్యేక)పాఠశాలలో హెచఎం భాస్కర్‌ ఉదయం 8.50గం లనుంచి యాప్‌ను డౌనలోడ్‌  కోసం ప్రయత్నిస్తే 11.21గంలకు నమోదయ్యింది. అప్పటివరకు హాజరు నమోదు కోసం సెల్‌లో కుస్తిపట్టాల్సి వచ్చిందిని వాపోయారు.  గోనెగండ్ల మండలంలోని పాఠశాలల్లో యాప్‌  డౌనలోడ్‌ కాలేదు. నందవరం మండలం పాఠశాలల్లో కొంతమంది యాప్‌ను డౌనలోడు చేసుకున్నప్పటికీ  బయోమెట్రి క్‌లో హాజరు నమోదు కాలేదు. మండలంలో   కేవలం 40 నుంచి 50 మంది మాత్రమే నమోదు అయింది. కాగా ఫ్యాప్టో యాప్‌ను డౌనలోడ్‌  చేసుకోవద్దని పిలుపు నివ్వటంతో అనేకమంది ఉపాధ్యాయులు యాప్‌ డౌనలోడ్‌ చేసుకోలేదు. ఈ  విధానాన్ని ప్రభుత్వం  రద్దుచేయాలని ఎస్‌ఎ్‌సయూఐ జిల్లా అధ్యక్షుడు  వీరేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

ఆదోని అగ్రికల్చర్‌, ఆగస్టు 16: ఆదోని నియోజిక వర్గంలోని పాఠశాలల్లో మంగళవారం ఆనలైన హాజరుతో ఉపాధ్యాయులు విసిగిపోయారు. నియోజకవర్గంలో 139 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 29 ఉన్నత పాఠశాలలో 110 ప్రాఽథమిక, ప్రాఽథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. అయితే ఎక్కడా ఆనలైన యాప్‌ ద్వారా అటెండెన్స వేయలేదు. ఆదోని నెహ్రూ మెమోరియల్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో 27 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల కాంప్లెక్స్‌ పరిధిలో 7 పాఠశాలలు ఉన్నాయి. ఆనలైన పద్ధతిలో హాజరు వేయలేక చివరికి   రిజిస్టర్‌లో సంతకం చేశారు. మండలంలోని దొడ్డనకేరి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో   ఉపాధ్యాయ సంఘాల బహిష్కరణ పిలపును పాటించి ఉపాధ్యాయులు   మ్యానువల్‌గా సంతకాలు చేసి తరగతులకు హాజరయ్యారు. 

  


Read more