‘ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2022-09-17T05:50:40+05:30 IST

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పీడీ ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్‌, డీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర డిమాండ్‌ చేశారు.

‘ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి’

కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 16: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పీడీ ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్‌, డీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక డీఈవో కార్యాలయంలో డీఈవో రంగారెడ్డిని కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదకర ప్రదేశాల్లో పాఠశాలలను నిర్వహిస్తున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే.. ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కండీషన్‌ లేని బస్సులను నడుపుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ సౌకర్యాలు కల్పించడంలో పాఠశాలల యజమాన్యాలు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపిం చారు. డీఈవోకు వినతిపత్రం అందజేసిన వారిలో నవ్యాంధ్ర యువజన కార్యదర్శి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యస్వామి, మారెప్ప, అజయ్‌, లోకేష్‌, అబీ, సురేష్‌, అనిల్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Read more