-
-
Home » Andhra Pradesh » Kurnool » A wooden tooth blown out of the subtreasury-MRGS-AndhraPradesh
-
అశ్వవాహనంపై నరసింహస్వామి
ABN , First Publish Date - 2022-03-17T05:25:12+05:30 IST
అహోబిలం బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఎగువన జ్వాలా నరసింహస్వామి అశ్వవాహనంపై ఊరేగించారు.

ఆళ్లగడ్డ, మార్చి 16: అహోబిలం బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఎగువన జ్వాలా నరసింహస్వామి అశ్వవాహనంపై ఊరేగించారు. స్వయంభువుగా వెలిసిన జ్వాలా నరసింహస్వామి యమునా నదిలో తన పాదాలు కడగటంతో తొట్టి తిరుమంజనం చేసినట్లుగా పురాణాల్లో ఉందని వేదపండితులు చెప్పారు. కార్యక్రమాల్లో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహదేశికన్, ఈవో నరసయ్య, మఠం అధికారి సంపత్, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్, వేదపండితులు పాల్గొన్నారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తి ప్రహ్లదవరదస్వామికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు వేదపండితులు కల్యాణం జరిపించారు. సాయంత్రం గజవాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఈవో నరసయ్య తదితరులు
నేడు ఇలా.. :ఎగువ అహోబిలంలో గురువారం రథోత్సవం, అభిషేకం కార్యక్రమాలను వేదపండితులు చేపడతారు. దిగువ అహోబిలంలో అశ్వవాహన సేవ ఉంటుంది.