మాతృ మరణాలపై సమీక్ష

ABN , First Publish Date - 2022-08-17T05:49:56+05:30 IST

జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యా లయంలో మంగళవారం డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు.

మాతృ మరణాలపై సమీక్ష

కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 16: జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యా లయంలో మంగళవారం డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. నగరంలోని షరీన్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలోని 78వ సచివాలయంలో జరిగిన మాతృ మరణంపై సమీక్షించారు. అధిక రక్తపోటుతో గర్భిణీ ఆసుపత్రికి వెళ్లగా అడ్మిట్‌ చేసుకోలేదని గత నెల 11న కర్నూలులో జీజీ హెచ్‌లో సిజేరియన్‌ కాన్పు ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చి 13న మరణిం చినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రమాదకర చిహ్నాలు కలిగిన గర్భిణులను కాన్పు తేదీకి ఒక వారం ముందుగానే ఆసుపత్రిలో అడ్మిషన్లు చేసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో కర్నూలు జీజీహెచ్‌ గైనిక్‌ హెచ్‌వోడీ డా.వెంకటరమణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డా.రత్నగఫూర్‌, అనస్థీషియా వైద్యులు డా.అనిత, కార్డియాలజీ వైద్యురాలు డా.లలిత కుమారి, షరీన్‌నగర్‌ యుపీహెచ్‌సీ వైద్యాధికారి డా.ముజామిల్‌ పాల్గొన్నారు.


Read more