చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-11T05:46:19+05:30 IST

పెద్దతుంబళంలో ఓ వ్యక్తి శనివారం ఉదయం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్‌ ఫోన్‌ దొంగతనం వివాదమే కారణం కావచ్చని పోలీసులు భావిన్నారు.

చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

సెల్‌ ఫోన్‌ వివాదమే కారణమంటున్న పోలీసులు

ఆదోని రూరల్‌, సెప్టెంబర్‌ 10 : పెద్దతుంబళంలో ఓ వ్యక్తి శనివారం ఉదయం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్‌ ఫోన్‌ దొంగతనం వివాదమే కారణం కావచ్చని పోలీసులు భావిన్నారు. ఎస్‌ఐ చెప్తున్న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరేష్‌(25) ఈ నెల 7న స్థానికంగా ఉన్న లోకేష్‌కు చెందిన మొబైల్‌ దుకాణంలో సెల్‌ఫోన్‌ దొంగలించాడు. ఆ సెల్‌ఫోన్‌లో లాక్‌ కోడ్‌ తీయించడానికి వీరేష్‌ శుక్రవారం పెద్దతుంబళంలోని మరో సెల్‌ఫోన్‌ దుకాణానికి వెళ్లాడు. ఆ దుకాణంలో ఉన్న ఓ వ్యక్తి నిందితుడ్ని గుర్తించి లోకేష్‌కు సమాచారం అందించాడు. లోకేష్‌ అక్కడ చేరుకొని వీరేష్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో వీరేష్‌ సెల్‌ఫోన్‌ను లోకేష్‌ ఇచ్చేశాడు. అయితే ఫోన్‌లో ఉన్న డెమో సిమ్‌ కూడ ఇవ్వాలని లోకేష్‌ పట్టు పడ్డాడు. అవమానానికి గురైన వీరేష్‌ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత కనిపించలేదు. శనివారం ఉదయం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిలో తాను కట్టుకున్న లుంగీతో చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. కాగా తన భర్తకు సెల్‌ఫోన్‌ దొరికిందని, ఆ సెల్‌ను లోకేష్‌కు ఇచ్చినా సిమ్‌కార్డుకు కూడా కావాలని ఆయన అడగడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య అంజినమ్మ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ రమేష్‌బాబు తెలిపారు.

Read more