కుక్కల దాడిలో కొండ గొర్రె మృతి

ABN , First Publish Date - 2022-08-17T06:00:44+05:30 IST

మండలంలోని రామాపురం గ్రామ పొలాల్లో కొండ గొర్రె మృతి చెందినట్లు రేంజ్‌ అధికారి నజీర్‌ ఝా తెలిపారు.

కుక్కల దాడిలో కొండ గొర్రె మృతి

బండి ఆత్మకూరు, ఆగస్టు 16: మండలంలోని రామాపురం గ్రామ పొలాల్లో కొండ గొర్రె మృతి చెందినట్లు రేంజ్‌ అధికారి నజీర్‌ ఝా తెలిపారు. మంగళవారం ఉదయాన్నే పొలాల్లో సంచరిస్తున్న కొండ గొర్రెను ఊర కుక్కలు వెంబడించి చంపాయన్నారు. పొలాలకు వెళ్ళిన రైతులు గొర్రె మృత దేహాన్ని చూసి సమాచారం అందజేశారన్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని గొర్రె మృత దేహానికి బండిఆత్మకూరు పశువైద్యాధికారి అనూష చేత శవ పరీక్షలు నిర్వహించి, అనంతరం గ్రామశివారులో ఖననం చేశామని రేంజర్‌ తెలిపారు.

Read more