మహిళను దుర్భాషలాడిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-08-18T05:06:37+05:30 IST

మండలంలోని గిడిగరేవుల గ్రామానికి చెందిన సురేష్‌ అనే వ్యక్తికి జూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిసే్ట్రట్‌ మాధవిలత, ప్రసన్నలత మూడేళ్లు జైలు శిక్ష రూ.1,500 జరిమానా విధించినట్లు ఎస్‌ఐ బీటీ వెంకటసుబ్బయ్య తెలిపారు.

మహిళను దుర్భాషలాడిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

గడివేముల, ఆగస్టు 17: మండలంలోని గిడిగరేవుల గ్రామానికి చెందిన సురేష్‌ అనే వ్యక్తికి జూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిసే్ట్రట్‌ మాధవిలత, ప్రసన్నలత మూడేళ్లు జైలు శిక్ష రూ.1,500 జరిమానా విధించినట్లు ఎస్‌ఐ బీటీ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివీ.. సురేష్‌ ఓ మహిళను సురేష్‌ దుర్భాషలాడి బెదిరించడంతో ఆమె 2019లో గడివేముల పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తరపున పబ్లిక్‌ ప్రాస్యూక్యూటర్‌ మహేశ్వరి తమ వాదనలు వినిపించారని అన్నారు. వాదోప వాదాలు అనంతరం సురేష్‌కు మూడేళ్లు జైలు శిక్ష, రూ.1,500 జరిమాన విధించారని ఎస్‌ఐ తెలిపారు.
Read more