విద్యాదీవెన ఖాతాల్లో రూ.25.61 కోట్లు - కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-11-30T22:44:13+05:30 IST

జిల్లాలో 4వ విడత జగనన్న విద్యాదీవెన కింద 2022 జూలై - సెప్టెంబర్‌ త్రైమాసానికి 43,707 మంది విద్యార్థులకుగాను అర్హులైన 38,673 మంది తల్లుల ఖాతాల్లో రూ.25.61కోట్లు ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన తెలిపారు.

   విద్యాదీవెన ఖాతాల్లో రూ.25.61 కోట్లు - కలెక్టర్‌

నంద్యాల టౌన, నవంబరు 30 : జిల్లాలో 4వ విడత జగనన్న విద్యాదీవెన కింద 2022 జూలై - సెప్టెంబర్‌ త్రైమాసానికి 43,707 మంది విద్యార్థులకుగాను అర్హులైన 38,673 మంది తల్లుల ఖాతాల్లో రూ.25.61కోట్లు ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన తెలిపారు. బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె బహిరంగ సభ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 4వ విడత జగనన్న విద్యాదీవెన పథకం కింద నగదును బటన నొక్కి సీఎం జగన మోహనరెడ్డి ప్రారంభించే కార్యక్రమాన్ని నంద్యాల కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన, ఇతర జిల్లాస్థాయి అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ సంక్షేమం కింద 10,639 విద్యార్థులు ఉండగా 9,394మంది తల్లుల ఖాతాల్లో రూ.5.53 కోట్లు, ఎస్టీ సంక్షేమం కింద 1,417 మంది విద్యార్థులుండగా 1,129 మంది తల్లుల ఖాతాల్లో 0.77 కోట్లు, బీసీ సంక్షేమం కింద 17,099 మంది విద్యార్థులుండగా 15,009 మంది తల్లుల ఖాతాల్లో రూ.9.81 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఈబీసీ కింద 4,826 మంది విద్యార్థులుండగా 4,420 మంది తల్లుల ఖాతాల్లో రూ.4.06 కోట్లు, ముస్లిం మైనార్టీ కింద 6,808 మంది విద్యార్థులుండగా 5,985 మంది తల్లుల ఖాతాల్లో రూ.3.64 కోట్లు, కాపు సంక్షేమం కింద 2,824 మంది విద్యార్థులుండగా 2652 మంది తల్లుల ఖాతాల్లో రూ.1.74 కోట్లు, క్రిస్టియన మైనార్టీ కింద 94 మంది విద్యార్థులుండగా 84 మంది తల్లుల ఖాతాల్లో రూ.6 లక్షలు, మొత్తం 43,707 మంది విద్యార్థులకు గాను అర్హులైన 38,673 మంది తల్లుల ఖాతాల్లో రూ.25.61కోట్లు జమ అయినట్లు తెలిపారు. అనంతరం జంబో చెక్కును విద్యార్థులు, తల్లులకు కలెక్టర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్‌ సునీతా అమృతరాజు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు చింతామణి, వివిధ సంక్షేమ శాఖ అధికారులు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T22:44:13+05:30 IST

Read more