108 డ్రైవర్‌పై గిరిజనుడి దాడి

ABN , First Publish Date - 2022-04-10T05:43:32+05:30 IST

కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామంలో 108 వాహనం డ్రైవర్‌పై విల్లంబుతో గిరిజనుడు దాడి చేశాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది.

108 డ్రైవర్‌పై గిరిజనుడి దాడి

కొత్తపల్లి, ఏప్రిల్‌ 9: కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామంలో 108 వాహనం డ్రైవర్‌పై విల్లంబుతో గిరిజనుడు దాడి చేశాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది.  గ్రామానికి చెందిన కుమ్మరి సంజీవ కర్ణ అనే వ్యక్తి గత కొంత కాలంగా 108 అంబులెన్సులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి నంద్యాల బహిరంగ సభలో విధులు నిర్వహించి సంజీవ కర్ణ గ్రామానికి చేరుకున్నాడు. కాగా శుక్రవారం రాత్రి సంజీవకర్ణ ఇంటి సమీపంలో ఉన్న గురు, రాముడు అనే ఇద్దరు చెంచులు మద్యం తాగి సంజీవకర్ణను దూషించారు. ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించిన సంజీవకర్ణతో వాగ్విదానికి దిగిన చెంచు రాముడు విల్లంబుతో సంజీవకర్ణపై దాడి చేశాడు. సంజీవకర్ణకు కుడిపక్క ఛాతీ కింది భాగంలో, పొట్టపై ఎడమ భాగంలో, కుడి చేతి మణికట్టుపై తీవ్రగాయాలయ్యాయి.  కొత్తపల్లి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళే సరికే చెంచులు పరారయ్యారు. కుటుంబ సభ్యులు సంజీవకర్ణను ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read more