-
-
Home » Andhra Pradesh » Kurnool District-MRGS-AndhraPradesh
-
కర్నూలు జిల్లాలో దారుణం..ఆస్తి కోసం తండ్రిని చితక బాదిన కొడుకు
ABN , First Publish Date - 2022-02-19T12:31:39+05:30 IST
ఆస్తి కోసం తండ్రి మీదే కొడుకు దాడి చేశాడు. ఈ సంఘటన ఈ నెల 16న జరిగింది. పెద్దమరివీడు గ్రామానికి చెందిన చంద్రన్న మొదటి భార్య గౌరమ్మ చనిపోవడంతో

కర్నూలు: ఆస్తి కోసం తండ్రి మీదే కొడుకు దాడి చేశాడు. ఈ సంఘటన ఈ నెల 16న జరిగింది. పెద్దమరివీడు గ్రామానికి చెందిన చంద్రన్న మొదటి భార్య గౌరమ్మ చనిపోవడంతో వెంకటేశ్వరమ్మను రెండో పెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య గౌరమ్మకు కుమారుడు మల్లేష్, కుతురు శిరీష ఉన్నారు. రెండో భార్య వెంకటేశ్వరమ్మకు ఇద్దరు కూతుళ్లు గౌరమ్మ, మల్లేశ్వరమ్మ ఉన్నారు. చంద్రన్నకు ఏడు ఎకరాల పొలం, 10 సెంట్ల స్థలం ఉంది. చంద్రన్న తన రెండో పెళ్లికి ముందు తనకు ఉన్న ఆస్తిలో మూడున్నర ఎకరం భూమి, 5 సెంట్ల స్థలాన్ని తన మొదటి భార్య కుమారుడు మల్లేష్‌కు ఇచ్చాడు. మిగిలిన మూడున్నర ఎకరాలు భూమి, 5 సెంట్ల స్థలం తన దగ్గరనే పెట్టుకున్నాడు. అయితే ఇటీవల చంద్రన్న ఎకరం భూమి, 5 సెంట్ల స్థలం విక్రయించాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి. రెండో భార్య వెంకటేశ్వరమ్మ మొదటి భార్య సంతానాన్ని నిందించడంతో మల్లేష్ ఆగ్రహానికిలోనై తండ్రి చంద్రన్నపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.