కృష్ణమ్మ, గోదారి పరవళ్లు

ABN , First Publish Date - 2022-08-15T08:50:39+05:30 IST

కృష్ణమ్మ, గోదారి పరవళ్లు

కృష్ణమ్మ, గోదారి పరవళ్లు

ధవళేశ్వరంలో కొనసాగుతున్న రెండో హెచ్చరిక

సముద్రంలోకి 14 లక్షల క్యూసెక్కులు విడుదల

శ్రీశైలానికి 3.78 లక్షల క్యూసెక్కుల వరద

నాగార్జునసాగర్‌కు 3.13 లక్షల క్యూసెక్కులు

గేట్లు మొత్తం ఎత్తి దిగువకు నీటి విడుదల


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ, గోదారి పరవళ్లు కొనసాగుతున్నాయి. గోదావరి వరద మెల్లగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ, భద్రాచలం వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14.8 అడుగుల నీటిమట్టం ఉంది.  బ్యారేజీ నుంచి సముద్రంలోకి 14,44,414 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానదిలోనూ వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి 3,78,483 క్యూసెక్కుల వరద శ్రీశైలం డ్యాంలోకి వస్తోంది. అవుట్‌ఫ్లో 3,79,842 క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్‌కు 3,13,379 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్‌ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 297.14 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 584.90 అడుగులకు చేరింది. నాగార్జునసాగర్‌ 26 గేట్లు ఎత్తారు. దీంతోపాటు కాలువలు, విద్యుత్‌ ఉత్పత్తి సహా మొత్తం 3,13,379 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి 3,37,469 క్యూసెక్కులు వస్తోంది. బ్యారేజీ 50 గేట్లు ఎత్తి 3.22 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.  

Updated Date - 2022-08-15T08:50:39+05:30 IST