పామర్రు జడ్పీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , First Publish Date - 2022-07-18T06:54:34+05:30 IST

జడ్పీ ఉన్నత పాఠశాల 1983-84 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాఠశాల సమీపంలోని కల్యాణ మండపంలో ఆదివారం సందడిగా నిర్వహించారు.

పామర్రు జడ్పీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పామర్రు : పామర్రు  జడ్పీ ఉన్నత పాఠశాల 1983-84 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాఠశాల సమీపంలోని కల్యాణ మండపంలో ఆదివారం సందడిగా నిర్వహించారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని, నాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు పద్మారెడ్డి, ప్రకాశరావు, సీతామహాలక్ష్మి, కస్తూర్బా తదితరులను  ఘనంగా సత్కరించారు. నాటి మిత్రులను, విద్య నేర్పిన గురువును కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. గురువులతో రోజంతా గడిపే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమం లో పలువురు పూర్వ విద్యార్దులు పాల్గొన్నారు.  

Read more