వైసీపీది నిరంకుశ పాలన

ABN , First Publish Date - 2022-11-24T00:45:28+05:30 IST

వైసీపీ ప్రభుత్వానిది నిరంకుశ పాలన అని, అవినీతి, అసమర్థ పాలనను ప్రజల్లో ఎండగడుతున్న టీడీపీ నాయకు లు, కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్నారని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, తెలు గుయువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆరోపించారు.

వైసీపీది నిరంకుశ పాలన
ముదునూరులో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నతెలుగు యువత నాయకులు

ముదునూరు(ఉయ్యూరు), నవంబరు 23: వైసీపీ ప్రభుత్వానిది నిరంకుశ పాలన అని, అవినీతి, అసమర్థ పాలనను ప్రజల్లో ఎండగడుతున్న టీడీపీ నాయకు లు, కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్నారని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, తెలు గుయువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆరోపించారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులకు నిరసనగా ముదునూరులో బుధవారం తెలుగు యువత ఆధ్వర్యం లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పంథాలో శాంతియుతంగా నిరసన తెలిపిన టీడీపీ పెన మలూరు ఇన్‌చార్జ్‌ బోడె ప్రసాద్‌కు నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ని దర్శమని పార్టీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు ఆందోళన వ్యక్తం చేశా రు. పార్టీ గ్రామ అధ్యక్షుడు దూసర అజయ్‌, కాటూరి శరత్‌, పామర్తి నాగరాజు, బూసే రవి, సజ్జా మధు, వెంకటనారాయణ, పాలడుగు మాధవి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:45:28+05:30 IST

Read more