యనమలకుదురు వంతెన పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-10T01:16:19+05:30 IST

ఆగిపోయిన వంతెన నిర్మాణం వెం టనే చేపట్టి ప్రయాణికుల వెతలు తీర్చాలంటూ 48 గంటల నిరాహార దీ క్షకు పిలుపునిచ్చిన వంతెన ఐక్య సాధన వేదిక నేతలు శుక్రవారం ఉద యం దీక్షను ప్రారంభించారు.

యనమలకుదురు వంతెన పూర్తి చేయాలి
వంతెన వద్ద నిరాహార దీక్షకు దిగిన ఐక్య వేదిక నేతలు

పెనమలూరు, డిసెంబరు 9 : ఆగిపోయిన వంతెన నిర్మాణం వెం టనే చేపట్టి ప్రయాణికుల వెతలు తీర్చాలంటూ 48 గంటల నిరాహార దీ క్షకు పిలుపునిచ్చిన వంతెన ఐక్య సాధన వేదిక నేతలు శుక్రవారం ఉద యం దీక్షను ప్రారంభించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు స్వయంగా దీక్షలు చే పట్టిన వారికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 11ఏళ్ల క్రితం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా నే టికీ పనులు పూర్తి చేయకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యధోరణికి నిదర్శనమన్నారు. మంత్రి, ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. శాంతియుత దీక్ష చేపట్టిన నేతల పట్ల పోలీసుల వైఖరి సరికాదన్నారు.

ఎమ్మెల్యే హామీతో దీక్ష విరమణ

విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే పార్థసారథి స్థానిక వైసీపీ నేతలను వేదిక వద్దకు పంపారు. నేతలు వెలగపూడి వరప్రసాద్‌, యార్లగడ్డ వీరబాబు, కోసూరి నరేష్‌ మాట్లాడుతూ జనవరిలో పనులు ప్రారంభించి శివరాత్రికి అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు తెలపగా నేతలు దీక్షను విరమించారు. దీక్షలో పాల్గొన్నవారిలో ఎస్కే కాసిం, వాటపల్లి శ్రీరాములు, ఇబ్రహీం, హుస్సేన్‌, సజ్జ వెంకటేశ్వరమ్మ, పుసులూరి లక్ష్మీనారాయణ, కృష్ణా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు రఘు, ఉప్పాడ త్రిమూర్తులు, నెరుసు ఆంజనేయులు, టీ గణేష్‌, లోకేష్‌, ఎస్కే మస్తాన్‌వలి, శ్రీనివాసరావు, జీవ, జయలక్ష్మి ఉన్నారు.

Updated Date - 2022-12-10T01:16:20+05:30 IST