ఘనంగా యలవర్తి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-11-25T02:19:09+05:30 IST

మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు 54వ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య గురువారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా యలవర్తి జన్మదిన వేడుకలు

గుడివాడ : మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు 54వ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య గురువారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని యలవర్తి స్వగృహంలో మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు, నెరుసు చింతయ్య, పొట్లూరి కృష్ణారావు, శొంఠి రామకృష్ణ, తూ ర్పు కృష్ణా డెల్టా మాజీ ఛైర్మన్‌ గుత్తా శివరామకృష్ణ (చంటి), భీమేశ్వరస్వామి దేవస్ధానం అభివృద్ధి కమిటీ చైర్మన్‌ చందరాల హరిరాంబాబు, ప్రముఖులు మెరుగు మోజెస్‌, మిక్కిలినేని రమేష్‌, వడ్డాది నాగరాజు, మాజీ ప్రజాప్రతినిధులు యలవర్తిని గజమాలలతో సత్కరించారు. యలవర్తి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బేతవోలులోని శాంతి వృద్ధుల ఆశ్రమంలో చీరలు, పండ్లు పంపిణీ చేసి అన్నదానం జరిపారు. ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో యలవర్తి అభిమానులు జన్మదినోత్సవ కేక్‌ను కట్‌ చేసి పంపిణీ చేశారు.

Updated Date - 2022-11-25T02:19:09+05:30 IST

Read more