మహిళా చట్టాలపై అవగాహన
ABN , First Publish Date - 2022-11-30T00:10:55+05:30 IST
మహిళలపై వేధింపులు, వివక్ష చూపితే చట్టం ప్రకారం కఠిన చర్యలుంటాయని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీ సువర్ణ అన్నారు. పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల చట్టం- 2013పై స్థానిక జడ్పీ హైస్కూ ల్‌లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఉయ్యూరు, నవంబరు 29 : మహిళలపై వేధింపులు, వివక్ష చూపితే చట్టం ప్రకారం కఠిన చర్యలుంటాయని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీ సువర్ణ అన్నారు. పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల చట్టం- 2013పై స్థానిక జడ్పీ హైస్కూ ల్‌లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలపై హింస పెరిగిపోతున్న నేపథ్యంలో చట్టాలపై అవ గాహన ఎంతో అవసరమన్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని విద్యార్థులకు సూచించారు. మహిళలకు అండగా ఉండేం దుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, బాలికా సంరక్షణ, నిర్భయ, దిశచట్టం, సుకన్య సమృద్ధియోజన తదితర పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నట్టు వివరిం చారు. ఉయ్యూరు ఐసీడీఎస్ అధికారి ఆరుద్ర, ఎంఈవో పద్మావతి, పట్టణ ఎస్సై ఎన్.వీరప్రసాద్ పాల్గొని మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు.
Read more