-
-
Home » Andhra Pradesh » Krishna » Women Economic Development through Handicrafts-NGTS-AndhraPradesh
-
చేయూతతో మహిళల ఆర్థికాభివృద్ధి
ABN , First Publish Date - 2022-09-28T06:26:01+05:30 IST
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథాకాలు అనుకున్న సమయానికి ప్రభుత్వం అందజే స్తుందని ప్రభుత్వవిప్ సామినేని ఉదయ భాను అన్నారు.

ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్మోహనరావు, రక్షణనిధి
జగ్గయ్యపేట, సెప్టెంబరు 27: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథాకాలు అనుకున్న సమయానికి ప్రభుత్వం అందజే స్తుందని ప్రభుత్వవిప్ సామినేని ఉదయ భాను అన్నారు. ఉక్కు కళావేదికలో చేయూత లబ్ధిదారుల సమావేశంలో ప్రసంగించారు. 1944 మందికి రూ.3.64 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేశామన్నారు. సామినేని వెంకట కృష్ణప్రసాద్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కమిషనర్ రాంభూపాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్ షేక్ హఫీజున్నీసా, తదితరులు పాల్గొన్నారు.
నందిగామ రూరల్ : మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. జడ్పీ పాఠశాలలో మూడో విడతచేయూతకు సంబంధించి నమూనా చెక్కును పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చేయూతను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీపీ అరిగెల సుందరమ్మ, జడ్పీటీసీ సభ్యుడు గాదెల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే ఐతవరంలో మంగళవారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సర్పంచ్ ఉదయలక్ష్మీ, వైస్ ఎంపీపీ పిచ్చయ్య, జడ్పీటీసీ సభ్యుడు గాదెల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
వీరులపాడు : తాటిగుమ్మిలో రూ. 40 లక్షలతో చేపడుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు శంకుస్థాపన చేశారు. ఎంపీపీ కోటేరు లక్ష్మీ, జడ్పీటీసీ సభ్యురాలు అమర్లపూడి కీర్తి సౌజన్య పాల్గొన్నారు.
ఎ.కొండూరు : మహిళా సాధికారతకు కృషిచేసి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందజేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి అన్నారు. గోపాలపురంలో మూడో మూడో విడత చేయూత ద్వారా 3,478 మందికి రూ.6.50 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలం లోని కిడ్నీ సమస్య పరిష్కారానికి రూ.38 కోట్లతో కృష్ణా జలాలు అందజేయనున్నట్టు తెలిపారు. కొత్తగా 10 ఆర్వో ప్లాంట్లు మంజూరు చేస్తున్నామన్నారు. అనంతరం గోపాలపురంలో గడప గడపకూ నిర్వహిం చారు. తిరవూరు ఏఎంసీ చైర్మన్ శీలం నాగనర్సిరెడ్డి, ఎంపీపీ కె.నాగలక్ష్మి, జడ్పీటీసీ సభుయడు గన్యా నాయక్, ఎంపీడీవో నాగేశ్వరావు, తహసీల్దార్ వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు. రోలుపడి పంచాయతీ లో రూ.56 లక్షలతో వివిధ పాఠశాలల్లో నాడు-నేడు పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీడీవో నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ ముండ్లపాటి కాంతమ్మ, జడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ శీలం నాగనర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.