కడపజిల్లా వాసులకే ముఖ్యమంత్రి న్యాయం చేస్తారా ?

ABN , First Publish Date - 2022-11-12T01:00:44+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహ నరెడ్డి కడప జిల్లా వాసులకే ముందుగా న్యాయం చేస్తారా? ఇతర ప్రాంత వాసులకు చేయరా? అని భూనిర్వాసితు లు ప్రశ్నించారు. విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ భూనిర్వాసితులు గుణదల్లోని ఏపీ జెన్‌కో వద్ద ధర్నా చేశారు.

కడపజిల్లా వాసులకే ముఖ్యమంత్రి న్యాయం చేస్తారా ?
ఏపీ జెన్‌కో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు

గుణదల, నవంబరు 11: ముఖ్యమంత్రి జగన్మోహ నరెడ్డి కడప జిల్లా వాసులకే ముందుగా న్యాయం చేస్తారా? ఇతర ప్రాంత వాసులకు చేయరా? అని భూనిర్వాసితు లు ప్రశ్నించారు. విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ భూనిర్వాసితులు గుణదల్లోని ఏపీ జెన్‌కో వద్ద శుక్రవారం ధర్నా చేశారు. విద్యుత్‌ ఉత్పాదక ప్లాంట్ల నిర్మాణానికి తమ వద్ద నుంచి పంట పొలాలు, ఇళ్ళు తీసుకున్నారని నెల్లూరు జిల్లా రైతు వెంకయ్య తెలిపారు. ప్లాంట్‌కోసం భూములు కోల్పోయిన తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి తీసుకునే సమయంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన అధికారులు, ప్రభుత్వం నేటికీ ఆ విషయంలో తాత్సారం చేస్తునే ఉన్నారని చెప్పారు. కొంత మందికి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. మూడు ప్లాంట్ల నిర్మాణం పూర్తయ్యాక భూనిర్వాసితులను పర్మినెంట్‌ చేస్తామని చెప్పిన జగన్మోహనరెడ్డి మాట తప్పారని ఆరోపించారు. ప్లాంట్‌ నిర్మాణం సమయంలో కడప జిల్లాకు చెందిన వ్యక్తులను తాత్కాలికంగా నియమించారని చెప్పారు. ఇలా ఏడాది క్రితం వచ్చిన 39మంది కార్మికులను ఇప్పుడు పర్మినెంట్‌ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మమ్మల్ని పక్కనపెట్టి మా జిల్లాతో సంబంధ లేని వారిని ఇక్కడ పర్మినెంట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు.

Updated Date - 2022-11-12T01:00:45+05:30 IST