అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2022-10-08T06:00:23+05:30 IST

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే కె.రక్షణనిధి తెలిపారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
విస్సన్నపేటలో సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే రక్షణనిధి

గడప గడపకులో ఎమ్మెల్యేలు రక్షణనిధి, జగన్‌మోహనరావు

విస్సన్నపేట, అక్టోబరు 7: అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే కె.రక్షణనిధి తెలిపారు. శుక్రవారం విస్సన్నపేట సచివాలయం - 1 పరిధిలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వంలో  పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాధుపాటి నాగమల్లేశ్వరి, ఎంపీపీ పిల్లి మెర్సి వనజాక్షి, జడ్పీటీసీ సభ్యుడు భీమిరెడ్డి లోకేశ్వర రెడ్డి, ఉప సర్పంచ్‌ మందపాటి సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీవో ఎస్‌.వెంకట రమణ, కేడీసీసీబీ డైరెక్టర్‌ బూక్యా రాణి, అనుమోలు శివబాజి, ఎన్వీ కుటుంబరావు, పాల్గొన్నారు.  


 అడవిరావులపాడులో..

నందిగామ రూరల్‌ : ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహనరావు అన్నారు.  అడవిరావులపాడులో శుక్రవారం పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఆకుల రంగ, సర్పంచ్‌ సూరా వెంకట నర్సమ్మ, నాయకులు నెలకుదిటి శివనాగేశ్వరరావు, సూరా కొండ,  తదితరులు పాల్గొన్నారు.  అడవిరావులపాడుకు చెందిన దివ్యాంగుడు  వేల్పుల నాగేశ్వరరావుకు  మండల పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ జగన్‌మోహనరావు ట్రై సైకిల్‌ అందజేశారు. పల్లగిరిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులతో శుక్రవారం ఎమ్మెల్యే  ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడప గడపలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించటం జరుగుతుం దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రవికిరణ్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ చిలుకూరి బుచ్చిరెడ్డి, నెలకుదిటి శివనాగేశ్వరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-08T06:00:23+05:30 IST