నీటి మీటర్ల బిగింపు అమానుషం

ABN , First Publish Date - 2022-12-10T01:12:30+05:30 IST

కృష్ణానది చెంతనే ఉన్నా నగర వాసుల ఇళ ్లకు నీటి మీటర్లు బిగించి వారిపై మరో భారం మోపడం అమానుషమని సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు అన్నారు.

నీటి మీటర్ల బిగింపు అమానుషం
నీటి మీటర్‌ను చూపిస్తున్న మహిళ

మధురానగర్‌, డిసెంబరు 9 : కృష్ణానది చెంతనే ఉన్నా నగర వాసుల ఇళ ్లకు నీటి మీటర్లు బిగించి వారిపై మరో భారం మోపడం అమానుషమని సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు అన్నారు. శుక్రవారం మధురానగర్‌ పసుపుతోటలో ఆయన పర్యటించారు. ఇం టింటికీ వెళ్లి సమస్యలను తె లుసుకున్నారు. చాలామంది తమ ఇళ్లకు నీటి మీటర్లు బి గించిన వైనాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు వచ్చి బిగించి వెళ్లిపోయారని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత్‌ పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం లొం గిపోయి నీటి మీటర్ల బిగింపునకు శ్రీకారం చుట్టడం దారుణమన్నారు. 24 గంట లు నీటి సరఫరా పేరుతో ప్రజలపై భారం వేయడం సరికాదన్నారు. ఇప్పటికే చెత్తపై పన్ను వేశారని, ఇళ్ల పన్నులు, విద్యుత్‌ చార్జీలు పెంచారన్నారు. స్థానిక సంస్థలను ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే సంస్థలుగా మార్చేశారన్నారు. గతంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పేరుతో మీటర్లు పెట్టడానికి సిద్ధమైనపుడు వామపక్షాలు అడ్డుకున్న సంగతి గుర్తు చేశారు. గతంలో మంచినీటి చార్జీలను ప్రతి ఏటా 7శాతం పెంచుతున్నపుడు తాము రాగానే తగ్గిస్తామని హామీ ఇచ్చి వైకాపా అధికారంలోకి వచ్చిందన్నారు. నీటి మీటర్ల బిగింపుపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పాలన్నారు. బిగించిన నీటి మీటర్లను వెంటనే తొలగించాలని లేకుంటే ప్రజలను సమీకరించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నేతలు పి.కృష్ణమూర్తి, చిన్నా, రామారావు, కిరణ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-10T01:12:31+05:30 IST