వేతనాల కోసం ఎదురుచూపు

ABN , First Publish Date - 2022-09-17T06:39:07+05:30 IST

మూలపాడు పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఏడాదిగా వేతనాలు ఇవ్వకపోవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేతనాల కోసం ఎదురుచూపు

మూలపాడు(ఇబ్రహీంపట్నం): మూలపాడు పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఏడాదిగా వేతనాలు ఇవ్వకపోవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బిల్‌కలెక్టర్‌, ఫిట్టర్‌, కాల్వపని, కరెంట్‌ మరమ్మతులు చేసే వాళ్లని పంచాయతీ అధికారులు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా తీసుకుని, పనులు చేయించారు. వారికి రూ.9వేల నుంచి 12వేల వరకు వేతనాలు  పంచాయతీ ఖర్చులో చూపిస్తూ కార్యదర్శి వాటిని అందజేసేవారు. కానీ,  ఏడాది గడిచినా కూడా ఒక్క రుపాయి వేతనం ఇవ్వకపోవటంతో తాము ఏలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందిచి వేతనాలు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Read more