వీఆర్వోలపై పనిభారం, ఒత్తిడి తగ్గించాలి

ABN , First Publish Date - 2022-12-13T01:31:18+05:30 IST

రెవెన్యూ విభాగంలో పనిచేసే వీఆర్వోలపై పనిభారం, ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామరెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మండలంలోని వీఆర్వోలు సోమవారం స్ధానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

 వీఆర్వోలపై పనిభారం, ఒత్తిడి తగ్గించాలి
తహసీల్దార్‌ డి.వనజాక్షికి వినతిపత్రం అందజేస్తున్న వీఆర్వోలు

ఉంగుటూరు, డిసెంబరు 12 : రెవెన్యూ విభాగంలో పనిచేసే వీఆర్వోలపై పనిభారం, ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామరెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మండలంలోని వీఆర్వోలు సోమవారం స్ధానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వీఆర్వోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జోసఫ్‌ తంబి, ఎస్‌. శ్రీనివాసరతన్‌ మాట్లాడుతూ, రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజు ఆదేశాల మేరకు వీఆర్వోలపై పెరిగిన పనుల ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోల సంఘం నాయకులు ఎ.సునీల్‌కుమార్‌, నళినీకుమార్‌, రామారావు, వినోద్‌కుమార్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:31:18+05:30 IST

Read more