వీఆర్‌ఏలపై ప్రభుత్వం చిన్నచూపు

ABN , First Publish Date - 2022-02-19T06:15:48+05:30 IST

వీఆర్‌ఏలపై ప్రభుత్వం చిన్నచూపు

వీఆర్‌ఏలపై ప్రభుత్వం చిన్నచూపు
మోకాళ్ల మీద నిలబడి వీఆర్‌ఏల నిరసన

గన్నవరం, ఫిబ్రవరి 18 : రెవెన్యూ వ్య వస్థలో కీలకంగా ఉన్న వీఆర్‌ఏల పట్ల ప్రభు త్వం చిన్న చూపు చూడటం సరికాదని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మండల అధ్యక్షుడు జి.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం.పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, నామినీలను వీఆర్‌ఏలుగా నియమిం చాలని దశల వారి ఆందోళనలో భాగంగా శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలియ జేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి వీఆర్‌ఏలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదన్నారు.  ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవటం సరికాదన్నారు.  వీఆర్‌ఏలు పులపాక ప్రసన్న, పద్మారావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, సుబ్బారావు, ప్రసన్న, జోస్పిన్‌ పాల్గొన్నారు. 

 వంటా వార్పుతో నిరసన

హనుమాన్‌జంక్షన్‌ : డిమాండ్ల సాధన కోసం బాపులపాడు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట  గ్రామ రెవెన్యూ సహాయకులు చేపట్టిన  నిరసన దీక్షలు 11వ రోజుకు చేరాయి.  శుక్ర వారం వంట వార్పుతో   నిరసన పాటించారు.  నిరసన కార్యక్రమంలో గన్నవరం మండల  గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు  జోషి,  వెంకటరత్నం మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామిలను  అమలు చేయా లని  డిమాండ్‌ చేశారు.  వీఆర్‌ఏలకు మద్దతు తెలుపుతూ  బాపులపాడు సీఐటీయూ నాయకు లు దీక్షలో పాల్గొన్నారు. 

  సమస్యలు పరిష్కరించాలి

ఉయ్యూరు  : సమస్యల పరిష్కారం కోరు తూ వీఆర్‌ఏలు చేస్తున్న పోరాటం న్యాయ మైనదని సీఐటీయూ జిల్లా తూర్పు కమిటీ  కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు అన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ మండల వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యాన తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో చేస్తున్న వీఆర్‌ఏల దీక్షా శిబిరాన్ని శుక్రవారం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీఆర్‌ఏల పోరాటానికి సీఐటీ యూ సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తుందన్నారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో  వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్య క్షుడు బొడ్డు వెంకటరత్నం, సీఐటీయూ ఉయ్యూ రు మండల కార్యదర్శి బి.రాజేష్‌,   డొక్కు ఏడు కొండలు, రాహుల్‌, నాగభూషణం పాల్గొన్నారు.

Updated Date - 2022-02-19T06:15:48+05:30 IST