ఓటు వజ్రాయుధం.. కాపాడుకోండి

ABN , First Publish Date - 2022-09-17T06:33:10+05:30 IST

ఓటు అనే వజ్రాయుధం ఉంటేనే ప్రజాస్వామ్యంలో సరైన నాయకుడ్ని ఎన్నుకోగలుగుతామని,

ఓటు వజ్రాయుధం.. కాపాడుకోండి
ఓటర్‌ను చైతన్యవంతం చేస్తున్న ఉమా

వలంటీర్ల ద్వారా ఓట్ల తొలగింపు 

 మాజీ మంత్రి దేవినేని ఉమా

గొల్లపూడి, సెప్టెంబరు 16: ఓటు అనే వజ్రాయుధం ఉంటేనే ప్రజాస్వామ్యంలో సరైన నాయకుడ్ని ఎన్నుకోగలుగుతామని, వైసీపీ నేతలు వలంటీర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఓట్లు తీసేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలో 265 బూత్‌ పరిధిలో రావూరి వెంచర్స్‌, పాత చైతన్య కాలేజీ, పైపుల కంపెనీ పక్కన ఆయన పర్యటించారు. ఓటర్‌ లిస్టును పరిశీలించి ఓటర్లను చైనత్య పరిచారు. అనంతరంమాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేరుంది, లేనిది పరిశీలించుకోవాలన్నారు. ఒక కుటుంబంలో నలుగురుంటే మూడు నాలుగు బూత్‌లకు ఓట్లు మార్చి వేసి ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా చేరాలన్నారు.  వైసీపీ చేసిన తప్పులను సరి చేసేందుకే బూత్‌ల పర్యటన చేస్తున్నట్లు ఉమా స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 


Read more