విప్లవ స్ఫూర్తి అల్లూరి

ABN , First Publish Date - 2022-07-05T06:55:52+05:30 IST

విప్లవ స్ఫూర్తి అల్లూరి

విప్లవ స్ఫూర్తి అల్లూరి
అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఉయ్యూరు మాజీ చైర్మన్‌ పూర్ణచంద్రరావు

 హనుమాన్‌జంక్షన్‌, జూలై 4 : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ స్ఫూర్తిని రగిలించి తన దేశ భక్తిని చాటుకున్న ధీరుడని సీపీఎం బాపులపాడు మండల కార్యదర్శి బేత శ్రీనివాసరావు అన్నారు. సోమవారం అల్లూరి సీతారామరాజు జయంతిని సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు.

ఉయ్యూరు  : అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని  సోమవారం ప్రజానాట్యమండలి, ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో స్ఫూర్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నాగళ్ల రాజేశ్వరమ్మ, జానకిరామయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ఉయ్యూరు మాజీ చైర్మన్‌ జంపాన పూర్ణచంద్రరావ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

విజయవాడ  రూరల్‌  : అల్లూరి సీతారామరాజు జయంతిని మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు.  ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి తహశీల్దార్‌ బీ సాయి శ్రీనివాస్‌ నాయక్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఆర్‌ఐ రామ్‌సింగ్‌, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.  

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : కానుమోలు గ్రంథాలయ ఆవరణలో సోమవారం అల్లూరి సీతారామరాజు 125 జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కొమరవల్లి గంగాభవాని, సర్పంచ్‌ ఎనికేపల్లి సీతమ్మ, డాక్టర్‌ వాహిని, రహీం, సుంకర సాంబశివ రాయల్‌, థామస్‌, ప్రేమలీల పాల్గొన్నారు. 

గన్నవరం :  ముస్తాబాద శాఖా గ్రంథాలయంలో అల్లూరి సీతా రామరాజు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు కడియాల గోపాలరావు,  దొండపాటి బాబూరావు, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఉంగుటూరు  :  అల్లూరి సీతారామరాజు  జయంతిని ఉంగు టూరు మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ వడ్లమూడి సరోజిని, మండల పరిషత్‌ ఉద్యో గులు,  పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Read more