మేయర్‌ పదవి ఇవ్వండి

ABN , First Publish Date - 2022-10-03T05:57:14+05:30 IST

మేయర్‌ పదవి ఇవ్వండి

మేయర్‌ పదవి ఇవ్వండి

సీఎంను కోరిన బండి పుణ్యశీల

వన్‌టౌన్‌, అక్టోబరు 2 : తనకు గతంలో ఇచ్చిన హామీ మేరకు విజయవాడ మేయర్‌ పదవి ఇవ్వాలని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల ఆదివారం సీఎం జగన్‌ను కోరారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆదివారం దుర్గగుడికి వచ్చిన సీఎంకు ఆమె వినతిపత్రాన్ని అందజేశారు. తనకిచ్చిన హామీ మేరకు మిగిలిన రెండున్నరేళ్లకైనా మేయర్‌ పదవి ఇవ్వాలని కోరారు. వినతిపత్రాన్ని పరిశీలించి చెబుతానని సీఎం అన్నట్టు సమాచారం. కార్పొరేషన్‌ ఎన్నికలు అయ్యాక మేయర్‌ పదవి పుణ్యశీలకేనని అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది. తీరా ఎన్నికలు ముగిశాక సీన్‌ మారిపోయింది. నాటకీయ పరిణామాల నడుమ రాయన భాగ్యలక్ష్మికి ఆ పదవి దక్కింది. తాజాగా మళ్లీ మేయర్‌ పదవి అంశం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.Read more