Vijayawada: భవానీ భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి

ABN , First Publish Date - 2022-10-05T13:09:09+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

Vijayawada: భవానీ భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి

విజయవాడ (Vijayawada): ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు బుధవారం కనకదుర్గ (Kanakadurga) అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. దుర్గమ్మను దర్శించేందుకు భవానీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శనానికి సుమారు రెండు గంటలకుపైగా సమయం పడుతోంది. భవానీలు ఇరుముడి సమర్పించేదుకు ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రేపు (గురువారం) కూడా ఇదే విధంగా భవానీల  తాకిడి ఉండే అవకాశం ఉందని అధికారులు  భావిస్తున్నారు.

Read more