ఉయ్యూరులో విగ్రహాల ఏర్పాటుకు కౌన్సిల్‌ ఆమోదం

ABN , First Publish Date - 2022-08-31T06:38:04+05:30 IST

ఉయ్యూరులో విగ్రహాల ఏర్పాటుకు కౌన్సిల్‌ ఆమోదం

ఉయ్యూరులో విగ్రహాల ఏర్పాటుకు కౌన్సిల్‌ ఆమోదం

 ఉయ్యూరు, ఆగస్టు 30 : ఉయ్యూరు ప్రధాన కూడళ్లలో నాలుగు విగ్రహాల ఏర్పాటుకు  నగర పంచాయతీ కౌన్సిల్‌ ఆమోదించింది.  చైర్మన్‌ వల్లభనేని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సాధా రణ సమావేశంలో అజెండాలోని అంశాల ఆమోదం అనంతరం, మాజీ ముఖ్యమంత్రులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌ కలాం, స్వాతంత్ర సమరయోఽధుడు గౌతు లచ్చన్న విగ్రహాల ఏర్పాటుకు కౌన్సిల్‌ ఆమోదం కోరుతూ టేబుల్‌ అంశం అజెండగా అధికారులు ప్రవేశ పెట్టారు. మెయిన్‌ రోడ్డులో ప్రధాన కూడలిలో రాజశేఖరరెడ్డి, మరో మూడు ప్రధాన కూడళ్లలో  రోశ య్య, గౌతు లచ్చన్న, అబ్ధుల్‌ కలాం విగ్రహాల ఏర్పాటుకు తీర్మానాన్ని  కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. కాగా విగ్రహాల ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించరా, అంబేడ్కర్‌ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయరని వైసీపీకి చెందిన ఒకటవ వార్డు కౌన్సిలర్‌ గుంజా సుధాకర్‌ ప్రశ్నించారు. అందరితో మా ట్లాడి ఏర్పాటు చేద్దామని చైర్మన్‌  పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లకు వెళ్లే రోడ్డులో జెమినీ స్కూల్‌ సమీపాన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రోడ్డు ఆక్రమించి డ్రెయిన్‌ నిర్మిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించు కోవడం లేదని 5వ వార్డు కౌన్సిలర్‌ పరిమి సలోమి సంతోషి  ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసిన తరువాతే వెంచర్‌కు సీఆర్డీఏ అనుమతి ఇచ్చిందని  చైర్మన్‌ జవాబిచ్చారు. వార్డులో  డ్రెయిన్‌ సమస్యను సమావేశం దృష్టికి తీసుకురాగా నిధుల కొరత ఉందని చైర్మన్‌ తెలిపారు.

Updated Date - 2022-08-31T06:38:04+05:30 IST