వీరుల త్యాగాలను స్మరించుకుంటూ..

ABN , First Publish Date - 2022-08-15T06:51:10+05:30 IST

వీరుల త్యాగాలను స్మరించుకుంటూ..

వీరుల త్యాగాలను స్మరించుకుంటూ..
కొత్తపేటలో కేబీఎన్‌ కళశాల విద్యార్థుల ప్రదర్శన

  జాతీయ జెండాలతో విద్యార్థుల ర్యాలీలు, సమరయోధులు, వారి కుటుంబ సభ్యులకు సత్కారం

వన్‌టౌన్‌ : వన్‌టౌన్‌లో అజాదీ కా అమృత్‌ మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. మల్లికార్జున పేట కొండపై  52వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు(చంటి) 10 అడుగుల జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. డివిజన్‌ నాయకులు పాల్గొన్నారు. స్టేట్‌  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మెయిన్‌ బ్రాంచీలో   సాతంత్ర్యోద్యమ చిత్రాలపై ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఎస్‌బీఐ అకౌంట్స్‌ డైరెక్టర్‌ రోజ్‌మేరీ,  డీజీఎం కె.రంగరాజన్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.  ఎస్‌బీఐ అమరావతి సర్కిల్‌ ఏజీఎం ఎస్‌ చక్రవర్తి, మెయున్‌ బ్రాంచీ ఏజీఎం స్వామి, ఉద్యోగులు, కస్టమర్లు  పాల్గొన్నారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వన్‌టౌన్‌ కేబీఎన్‌ కాలేజీలో  పోటీలు నిర్వహించి విజేతలకు  బహుమతులు అంద జేశారు.  విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌  శైలజారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  కొత్తపేటలో విద్యార్థులు పతాక ప్రదర్శన నిర్వహించారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ పి.ఎల్‌.రమేష్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, జూనియర్‌ కళాశాల ఇన్‌చార్జ్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.భాగ్యకుమార్‌, ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు వి.ఎ్‌స.రావు, డి.పవన్‌కుమార్‌, ఎన్‌.సాంబశివరావు, ఎన్‌సీసీ ఆఫీసర్‌ విజయ్‌భాస్కర్‌, అధ్యాపకులు శాంతి, హేమంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు ఎంఎస్‌ బేగ్‌ టీడీపీ నాయకులతో కలిసి  బీఆర్‌పీ రోడ్డు, నెహ్రూ బొమ్మ సెంటర్‌, వించిపేట, తదితర ప్రాంతాలలో పతకాలను పంపిణీ చేశారు. టీడీపీ నగర మాజీ కార్యనిర్వహక కార్యదర్శి మీర్జా ముజఫర్‌ బేగ్‌,  నాయకులు సుకాశి కిరణ్‌, కొప్పుల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.   వన్‌టౌన్‌లో మహేశ్వరీ సమాజ్‌ ఆధ్వర్యంలో పతాక ర్యాలీ నిర్వహించారు.  సమరయోధుల వేషధారణలో చిన్నారులు అలరించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, 53వ డివిజన్‌ కార్పొరేటర్‌, వీఎంసీ స్టాండింగ్‌ కమిటీ మాజీ మెంబర్‌ మహాదేవు అప్పాజీరావు హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త నందకిషోర్‌ లోయ, మహేశ్వరీ సమాజ్‌ కమిటీ ప్రతినిధులు ఉత్తమ్‌చంద్‌ గుప్త, గోపాల్‌ భటాడ్‌, బాలకృష్ణ లోయ, మధుసూదన్‌హినానీ, గోవింద్‌ లాల్‌ మల్‌పాణీ, మహిళలు  పాల్గొన్నారు. 

చిట్టినగర్‌  : చిట్టినగర్‌, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు. జాతి నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీనగరాల సంఘం ఆధ్వర్యంలో కె.ఎల్‌.రావునగర్‌ నుంచి కేటీరోడ్డు చిట్టినగర్‌ వరకు చేపట్టిన ఆజాదీ కా అమృత్‌  మహోత్సవ్‌ ర్యాలీని నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి  ప్రారంభించారు. విద్యార్థులు భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.  చిట్టినగర్‌ మరపిళ్ల చిట్టి పార్కులోని ఆయన విగ్రహానికి 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపిళ్ల రాజేష్‌, ప్రముఖ సినీ రచియిత ముదిలి సంజీవ్‌, న్యాయవాది పిళ్లా రవి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కె.ఎల్‌.రావునగర్‌ రాకేష్‌ పబ్లిక్‌ స్కూల్లో స్వాతంత్య్ర సమరయోధురాలు రాంపిళ్ల నరసాయమ్మను, స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాంపిళ్ల జయప్రకా్‌షలను సంఘం నాయకులు నాగోతి వెంకటేశ్వరరావు (ఎన్‌.వి.రావు), రాష్ట్ర అధ్యక్షుడు మరుపిళ్ల దేవి ప్రసాద్‌, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు శివనాగేశ్వర్‌ తదితరులు ఘనంగా సత్కరించారు.  కొరగంజి భాను, మజ్జి శ్రీనివాసరావు, బాయన బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. 

జనసేన ఆధ్వర్యంలో ...

ఆజాదీ కా అమృత్‌ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు పట్నాల జయరాం, అడ్డూరి తమ్మారావు, కత్తి రామయ్య  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 400 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని నగర పార్టీ అధ్యక్షుడె పోతిన వెంకట మహేష్‌ ప్రారంభించారు.  బంగారయ్య కొట్టు సెంటర్‌ నుంచి ఎర్రకట్ట, చిట్టినగర్‌, సొరంగం వరకు ర్యాలీ జరిగింది. ర్యాలీలో బత్తుల వెంకటేశ్వరరావు, కొరగంజి వెంకటరమణ, పొట్నూరి శ్రీనివాస్‌, ఎన్‌, కనకరావు, రాంబాబు, వంశి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 తెలుగుయువత ఆధ్వర్యంలో

 పశ్చిమ నియోజకవర్గం తెలుగుయువత ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్పవ ఘనంగా నిర్వహించారు. 1000 అడుగుల జాతీయ జెండాతో చిట్టినగర్‌ జంక్షన్‌ నుంచి టీడీపీ నాయకులు బారీ ర్యాలీ నిర్వహించారు.  పశ్చిమ నియోజకవర్గం తెలుగుయువత అధ్యక్షులు రాళ్లపూడి మాధవ్‌, మహిళా అధ్యక్షురాలు సుకాశి సరిత, సారిపల్లి రాధాకృష్ణ పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

 రాంపిళ్ల నరసాయమ్మకు సీఐ సత్కారం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో  సయ్యద్‌ అప్పలస్వామి కళాశాల సమీపంలో స్వాతంత్య్ర సమరయోధురాలు రాంపిళ్ల నరసాయమ్మను కొత్తపేట సీఐ ఏ.సుబ్రమణ్యం ఘనంగా సత్కరించారు.  స్వాత్రంత్య్ర సమరయోధుల వారసుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాంపిళ్ల జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more