జగన్‌ హామీలు బుట్టదాఖలు..

ABN , First Publish Date - 2022-08-31T06:56:47+05:30 IST

వైసీపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎ్‌స రద్దు చేసి ఓపీఎ్‌సను అమలు చేస్తానని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారని కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిన నేతలు విమర్శించారు.

జగన్‌ హామీలు బుట్టదాఖలు..

- జీపీఎస్‌ పేరుతో కొత్త డ్రామాలు

- సీపీఎ్‌సను రద్దు చేసి ఓపీఎ్‌సను అమలు చేయాలి

- ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళనలకు కార్మిక సంఘాల మద్దతు

- 8న రాష్ట్ర సదస్సు : కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక

ధర్నాచౌక్‌, ఆగస్టు 30 : వైసీపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎ్‌స రద్దు చేసి ఓపీఎ్‌సను అమలు చేస్తానని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారని కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిన నేతలు విమర్శించారు. మూడేళ్లుగా కమిటీలు, చర్చల పేరుతో మోసం చేసిన జగన్‌ జీపీఎస్‌ పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ డ్రామాలు కట్టిపెట్టి ఓపీఎ్‌సను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వీరు మాట్లాడారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దీన్ని భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధ విధానాలు అవలంభిస్తున్నదన్నారు. పాత పెన్షన్‌ అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళలనకు మద్దతుగా సెప్టెంబర్‌ 8న నగరంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని నేతలు ప్రకటించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నేతలు వి.ఉమామహేశ్వరరావు, జి.ఓబులేసు, కె.పొలారి, హెచ్‌ఎంఎస్‌ నేత కె.పాములు, ఏఐసీసీటీయూ, ఏఐయూటీయూసీ, ఏఐసీటీయూ నేతలు ఉదయ్‌ కిరణ్‌, సుధీర్‌, ఎస్‌.కె.ఖాదర్‌భాషా, ఇప్ట్యూ నేత ఎం.రామకృష్ణ, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more