వసుమతి సాహితీ సేవలు ప్రశంసనీయం

ABN , First Publish Date - 2022-09-19T05:41:01+05:30 IST

రచయిత్రి చలసాని వసుమతి సాహితీ సేవలు ప్రశంసనీయమని మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ అ న్నారు.

వసుమతి సాహితీ సేవలు ప్రశంసనీయం

విజయవాడ కల్చరల్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : రచయిత్రి చలసాని వసుమతి సాహితీ సేవలు ప్రశంసనీయమని మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ అ న్నారు. లబ్బీపేటలో మ్యానర్‌ ఫుడ్‌ప్లాజాలో ఆదివారం సాయంత్రం చలసాని వసుమతి మాధవ సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో వసుమతి మాధవ జీవన సాఫల్య పురస్కార ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ 15 ఏళ్లుగా సాహితీ రంగం లో విశేష సేవలందిస్తున్న లబ్దప్రతిష్టులను గుర్తించి పురస్కారాలతోపాటు నగదు బహుమతులను అందచేస్తున్నానన్నారు. డాక్టర్‌ రావి శారద, డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు, డాక్టర్‌ తుర్లపాటి రాజేశ్వరికి వసుమతి మాధవ జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఒడి యా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గోపీనాథ్‌ మహంతి రచనను తెలుగులో ఈతచెట్టు దేవుడు పేరుతో అనువదించిన రాజేశ్వరి పుస్తకాన్ని బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించారు. గుత్తికొండ సు బ్బారావు, విహరి, జీవీ పూర్ణచందు, చలసాని వసుమతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read more