ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2022-10-08T06:09:35+05:30 IST

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
పోస్టాఫీసు వద్ద ధర్నా చేస్తున్న పోస్టల్‌ ఉద్యోగులు

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 7: సబ్‌ పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ సూపరిం టెండెంట్‌ కార్యాలయం వద్ద శుక్రవారం పోస్టల్‌ ఉద్యోగులు ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసిన పోస్టాఫీసులను తక్షణం పునరుద్ధరించాలని, పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు మానిటరీ బెనిఫిట్లు ఇవ్వాలని, క్వార్టర్స్‌ను బాగు చేయించాలని, హెచ్‌ఆర్‌ఏ అందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోస్టల్‌ జేఏసీ నాయకులు డాక్టర్‌ సాంబశివరావు, ఎం.శివప్రసాద్‌, శాయన రమేష్‌, ఈడే శ్రీనివాసరావు, కె.అమలేశ్వరరావు, సీహెచ్‌ శ్రీనివాసరావు, ఎం.వెంకటేశ్వరరావు, జి.వి.రావు, ఎం.యూసఫ్‌, కె.రంగనాయకులు, జి.అంజిబాబు, సి.ఎల్‌.శ్యామసుందరం, వై.వి.ఎస్‌.ప్రసాద్‌, జె.వి.సుబ్బారావు ధర్నాలో పాల్గొన్నారు. Read more