-
-
Home » Andhra Pradesh » Krishna » upadhyaudugaa collector-NGTS-AndhraPradesh
-
ఉపాధ్యాయుడిగా కలెక్టర్
ABN , First Publish Date - 2022-04-24T05:58:55+05:30 IST
ఉపాధ్యాయుడిగా కలెక్టర్

కలువపాముల(ఉయ్యూరు), ఏప్రిల్ 23 : ఎక్కాలు ఎంతవరకు వచ్చు, కాసాగు అంటే ఏమిటీ? అని కలెక్టర్ రంజిత్‌బాషా కలవపా ముల జడ్పీ హైస్కూల్ పదవ తరగతి విద్యా ర్థులను ప్రశ్నించారు. గ్రామంలో జగనన్న కాలనీ లే -అవుట్లో ఇళ్ల నిర్మాణాన్ని శనివారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించి పదవ తరగతి గదిలోకి వెళ్లి లెక్కలు, ఎక్కాలకు సంబంధించి విద్యార్థులను ప్రశ్నించారు. విద్యా ర్థులు ఏ మాత్రం స్పందింకపోవటంతో హెచ్ఎం తులసీరాణి, ఉపాధ్యాయులు, ఏంఈవో కనక మహాలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంత రం చాక్‌పీస్ చేత పట్టుకుని బ్లాక్ బోర్డుపై లెక్కలు చేసి చూపించారు. అనంతరం మధ్యా హ్నభోజనం పరిశీలించి చక్కెర పొంగలి ఉడక కుండా ఉండటం, సాంబారు నీళ్లులా ఉండ టంపై ఉపాధ్యాయులను నిలదీశారు. డీఈవో తాహెరా సుల్తానా, ఆర్డీవో విజయ్‌కుమార్, తహ సీల్దార్ నాగేశ్వరరావు, ఎంపీడీవో పాల్గొన్నారు.
నగర పంచాయతీ పరిధిలో అనధికార లే-అవు ట్లపై కమిషనర్ చర్యలు తీసుకోవడంలో అల సత్వం వహిస్తున్నారని సామాజిక కార్యకర్త జం పాన శ్రీనివాసగౌడ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గండిగుంట వచ్చిన కలెక్టర్‌ను కలిసి అనధికార లే - అవుట్లపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.