వైసీపీ పాలనలో సంక్షేమ వసతి గృహాలు నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-11-19T00:42:08+05:30 IST

సంక్షేమ వసతిగృహాలను వైసీపీ ప్ర భుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, వాటిని పున రుద్ధరించి, అందుబాటులోకి తేవాలని మాజీ ఎమ్మె ల్యే రావి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

వైసీపీ పాలనలో సంక్షేమ వసతి గృహాలు నిర్వీర్యం
పోరుబాట పోస్టర్లు ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి

గుడివాడ: సంక్షేమ వసతిగృహాలను వైసీపీ ప్ర భుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, వాటిని పున రుద్ధరించి, అందుబాటులోకి తేవాలని మాజీ ఎమ్మె ల్యే రావి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవా రం టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో టీఎన్‌ఎస్‌ ఎఫ్‌ ఆధ్వర్యంలో సంక్షేమ వసతిగృహాల పోరుబాట పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు లేక పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మెనూ సక్ర మంగా అమలు చేయకపోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 21 నుంచి టీఎన్‌ఎస్‌ఎఫ్‌ పోరుబాటలో భాగంగా వసతిగృహాల్లో నిద్రించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ తామని తెలిపారు. టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ మచిలీపట్నం పార్లమెంట్‌ అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి, వంశీ, సురేంద్ర, పాపారావు, అనంత్‌, సాయి, ఇసాక్‌, భాను, మణికంఠ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:42:08+05:30 IST

Read more