చెట్లకు పునర్జన్మ ఇచ్చారు!

ABN , First Publish Date - 2022-01-03T05:53:18+05:30 IST

చెట్లకు పునర్జన్మ ఇచ్చారు!

చెట్లకు పునర్జన్మ ఇచ్చారు!
రైల్వేకాలనీలోని బిషప్‌ హజరత్తయ్య స్కూల్‌ వద్ద రైల్వే స్థలం నుంచి తెచ్చి రైల్వేట్రాక్షన్‌ సెంటర్‌ ముందు నాటిన చెట్లు

సత్యనారాయణపురం, జనవరి 2: భవన నిర్మాణానికి అడ్డంగా ఉన్న చెట్లను నరికి పారేయకుండా తిరిగి వాటిని వేరొక చోట నాటి అందరి మన్ననలను రైల్వే అధికారులు అందుకు న్నారు. సత్యనారాయణపురం రైల్వేకాలనీలోని బిషప్‌ హజరత్తయ్య స్కూల్‌ వద్ద  రైల్వే స్థలంలో అధికారులు భవన నిర్మాణం చేపట్టారు. అక్కడ ఉన్న రెండు మామిడి చెట్లు, ఒక రావి చెట్టు కొమ్మలను తొలిగించి చెట్లను వేర్లతో సహా తవ్వి తీసి క్రేన్ల సాయంతో వాటిని రైల్వే ట్రాక్షన్‌ సెంటర్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నాటారు. అవి తిరిగి చిగురించే వరకూ నిత్యం సిబ్బంది వాటికి నీళ్లు పోస్తున్నారు. 


Read more