వైసీపీ నేతల ఇసుక రవాణా

ABN , First Publish Date - 2022-10-04T06:39:58+05:30 IST

వైసీపీ నేతల ఇసుక రవాణా

వైసీపీ నేతల ఇసుక రవాణా
టీడీపీ కార్యకర్తలకు పట్టుబడిన ఇసుక ట్రాక్టర్‌

అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు.. ఒక ట్రాక్టర్‌ పట్టివేత 

కంచికచర్ల/కంచికచర్ల రూరల్‌, అక్టోబరు 3: మండలంలోని గనిఆత్కూరులో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక ఇసుక ట్రాక్టరును పోలీసులకు అప్పగించారు. గనిఆత్కూరు వద్ద కృష్ణానదిలో అర్ధరాత్రి సమయాల్లో గుట్టుగా ఇసుక అక్రమ తవ్వకాలు చేసి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఆదివారం రాత్రి నిఘా పెట్టారు. సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో సర్పంచ్‌ షేక్‌ ఇబ్రహీం, ఎంపీటీసీ సభ్యుడు వెంపరాల వెంకటేశ్వరరావుతో పాటుగా కొంత మంది టీడీపీ కార్యకర్తలు ఇసుక ట్రాక్టర్లను వెం బడించారు. ఒక ట్రాక్టరు పట్టుబడగా, మరో రెండు తప్పించుకుపోయాయి. ఈలోపు రంగంలోకి దిగిన వైసీపీ నేతలు, నాడు - నేడు, గ్రామ సచివాలయ భవనాల పనుల కోసం అధికారుల అనుమతితో ఇసుక తరలి స్తున్నట్టు చెప్పుకొచ్చారు. కావాలని రాద్ధాంతం చేస్తున్నారు తప్పితే తాము ఎలాంటి అక్రమ రవాణాకు పాల్పడటం లేదని వైసీపీ  నేతలు పేర్కొన్నారు. అనుమతులు ఉంటే, పగలు కాకుండ రాత్రిళ్లు ఎందుకు తోలుతున్నా రంటూ టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. పోలీసులకు సమాచారం అందించి, ఇసుక ట్రాక్టరును అప్పగించారు. 


Read more