19, 20 తేదీల్లో ఎంపీటీసీ సభ్యులకు శిక్షణ

ABN , First Publish Date - 2022-03-18T06:42:46+05:30 IST

19, 20 తేదీల్లో ఎంపీటీసీ సభ్యులకు శిక్షణ

19, 20 తేదీల్లో ఎంపీటీసీ సభ్యులకు శిక్షణ

విజయవాడ రూరల్‌, మార్చి 17: మండలంలోని ఎంపీటీసీ సభ్యులకు ఈనెల 19, 20 తేదీల్లో గన్నవరం మండలవ పరిషత్‌ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. మండల పరిషత్‌ పాలన, సభ్యులు వ్యవహరించాల్సిన విధానంపై ఎంపీడీవోలు శిక్షణ ఇవ్వనున్నారు. 

కంకిపాడు/ ఉయ్యూరు: కంకిపాడు, ఉయ్యూరు మండలాల ఎంపీటీసీ సభ్యులకు రెండు రోజులపాటు కంకిపాడులో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కంకిపాడు ఎంపీడీవో కొడాలి అనురాధ, ఉయ్యూరు ఎంపీడీవో సునీతాశర్మ గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈ నెల 19, 20వ తేదీల్లో కంకిపాడులోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో తరగతులు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. కంకిపాడు మండలంలోని 20మంది ఎంపీటీసీ సభ్యులు, ఉయ్యూరు మండలంలోని 11మంది ఎంపీటీసీ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.


Read more