నేటి అర్ధరాత్రి ఆంక్షలు

ABN , First Publish Date - 2022-12-31T01:12:28+05:30 IST

నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఇవి అమల్లో ఉంటాయని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కాంతిరాణా వెల్లడించారు.

నేటి అర్ధరాత్రి ఆంక్షలు

రాత్రి నుంచి డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల నమోదు

విజయవాడ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఇవి అమల్లో ఉంటాయని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కాంతిరాణా వెల్లడించారు. కమిషనరేట్‌ పరిధిలో 144, 30 సెక్షన్లు అమలు చేస్తున్నామని చెప్పారు. నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను రాత్రి 9 గంటల నుంచి మూసివేస్తారు. బెంజిసర్కిల్‌ రెండు ఫ్లై ఓవర్లు, రామవరప్పాడు ఫ్లై ఓవర్లు, కనకదుర్గమ్మ, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ఫ్లై ఓవర్లపై ఎలాంటి రాకపోకలను అనుమతించరు. ప్రధాన రహదారులైన ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఏలూరు, బందరు రోడ్డులో రాత్రి 12 గంటల వరకే ట్రాఫిక్‌ను అనుమతిస్తారు. బీఆర్టీఎస్‌ రోడ్డును పూర్తిగా మూసివేస్తారు. క్లబ్‌లు, రెస్టారెంట్లలో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకోవడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో డీజేలపై నిషేఽధం విధించారు. వేడుకల ముసుగులో మహిళలు, యువతులపై అసభ్యకరంగా ప్రవర్తించినా, ఈవ్‌టీజింగ్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటారు. నగరంలో తెల్లవార్లూ డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారు.

Updated Date - 2022-12-31T01:12:28+05:30 IST

Read more