సంకల్పసిద్ధి కేసులో మరో ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2022-12-13T02:00:09+05:30 IST

సంకల్పసిద్ధి ఈకార్ట్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కేసులో మరో ముగ్గురిని ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

సంకల్పసిద్ధి కేసులో మరో ముగ్గురి అరెస్టు

కేసులో 12కు చేరిన నిందితుల సంఖ్య

విజయవాడ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): సంకల్పసిద్ధి ఈకార్ట్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కేసులో మరో ముగ్గురిని ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురితో అరెస్టుల సంఖ్య 12కి చేరింది. గన్నవరానికి చెందిన రహీంబాషా, విద్యాధరపురానికి చెందిన కిషోర్‌, అనంతపురానికి చెందిన భాస్కర నాయుడులను సోమవారం అరెస్టు చేశారు. తొలి విడతలో సంకల్ప సిద్ధి డైరెక్టర్‌ గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిషోర్‌, గంజాల లక్ష్మి, మావూరి వీరవెంకటలక్ష్మి, జాకీర్‌ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. తర్వాత మరో నలుగురిని అరెస్టు చేశారు. తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురు సంకల్పసిద్ధికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2022-12-13T02:00:09+05:30 IST

Read more